About US

Spread the love

Satyameva Jayate.in is a newly launched news web portal. This company has nothing to do with the ‘Satyamev Jayate’ program aired on Hindi and other language TV channels some time ago, led by Bollywood actor Aamir Khan. This is a Telugu news and news articles website. The website is run by young journalists with experience of working in various media organisations in the states of Andhrapradesh and Telangana. We have set up this news web portal inspired from legendary journalist, People’s Archive of Rural India (pari) Founder Palagummi Sainath and the founder of thewire.in news web portal, Siddharth Vadra Rajan . 

There is a fight going on around the world over fake news. At the same time, information that contributes to violence and mania is growing exponentially. Many media outlets in the hands of corporate companies are covering up facts they do not like in the name of fighting fake news. Hate information is going viral on the internet if they like. Providing factual information in this context is becoming a laborious and costly task. News websites that have recently launched as an alternative medium are providing some relief. More alternative websites are yet to come.

sathyamevajayate.in articles are reflect the status of rural people, their culture and traditions in the two Telugu states of Andhra Pradesh and Telangana. Articles are also cover the southern states like Tamil Nadu, Karnataka and Kerala as well as Telugu states. Sathyamevajayate.in In fact nothing but a startup initiative. sathyamevajayate.in was founded with good intentions, we hopes on you and we need your support.

సత్యమేవ జయతే.ఇన్ https://sathyamevajayate.in 2020లో కొత్తగా ప్రారంభించిన న్యూస్ వెబ్ పోర్టల్. ప్రముఖ బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ నేతృత్వాన హిందీ, ఇతర భాషల టివి ఛానెళ్లలో కొంత కాలం క్రిందట ప్రసారమైన ‘సత్యమేవ్ జయతే` కార్యక్రమానికి ఈ సంస్థకి ఎటువంటి సంబంధమూ లేదు. ఇది తెలుగు వార్తా, కథనాల వెబ్ సైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో వివిధ మీడియా సంస్థల్లో పని చేసి అనుభవం గడించిన యువ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ వెబ్ సైట్ నడుస్తోంది. దిగ్గజ పాత్రికేయుడు,  People’s Archive of Rural India (pari) వ్యవస్థాపకుడు పాలగుమ్మి సాయినాథ్, Thewire.in వెబ్ పోర్టల్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ వదర రాజన్ ప్రేరణతో సత్యమేవజతయే.ఇన్ తెలుగు న్యూస్ వెబ్ పోర్టల్ ను స్థాపించాము.

ప్రపంచ వ్యాప్తంగా నకిలీ వార్తలపై పోరాటం నడుస్తోంది. అదే సమయంలో హింసను, ఉన్మాదాన్ని ప్రేరేపేంచేందుకు దోహదం చేస్తున్న సమాచారం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కార్పోరేట్ కంపెనీల చేతిలోని పలు మీడియా సంస్థలు నకిలీ వార్తలపై పోరాటం పేరుతో తమకు నచ్చని వాస్తవాలను కప్పిపెడుతున్నాయి. తమకు నచ్చితే విద్వేష సమాచారాన్ని యథేశ్చగా ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవిక సమాచారం అందించడం ఎంతో శ్రమతో, వ్యయంతో కూడిన పని అవుతోంది. ప్రత్యామ్నాయ మాధ్యమాలుగా ఇటీవల ప్రారంభమైన న్యూస్ వెబ్ సైట్లు కొంత వరకూ ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రత్యామ్నాయ వెబ్ సైట్లు ఇంకా రావాల్సిన అవసరముంది.

ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజల స్థితి గతులను, వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా sathyamevajayate.in కథనాలుంటాయి. తెలుగు రాష్ర్టాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలయిన తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రజలకు సంబంధించిన కథనాలు కూడా sathyamevajayate.inలో ఉంటాయి.  వాస్తవంగా చెప్పాలంటే sathyamevajayate.in అంకుర సంస్థ. మంచి సంకల్పంతో స్థాపించిన ఈ సంస్థను ఆదరిస్తారని https://sathyamevajayate.in ఆశిస్తోంది. 

error: Content is protected !!