Connect with us

Agriculture

రైతు భరోసా ఛానెల్ ప్రారంభం

Published

on

Spread the love

అమరావతి : రైతు భరోసా కేంద్రాలు (ఆర్ బికె)లలో నిర్వహించనున్న రైతు అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఛానెల్ ను ప్రారంభించింది. RBK Channel పేరుతో ఈ ఛానెల్ ప్రసారం కానుంది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఈ ఛానెల్ ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ .. ప్రతి గ్రామంలోనూ రైతులకు దగ్గరగా ఉండే ఒక వ్యవస్ధ, రైతులకు విత్తనం వేసే రోజు నుంచి పంట అమ్ముకునేంతవరకు కూడా ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ చేయి పట్టుకుని  నడిపించే వ్యవస్ధ కచ్చితంగా గ్రామాలలో రావాలి అన్న తాపత్రయం, తపన నుంచి పుచ్చిన బీజం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) అని ఆయన అన్నారు.

రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూనే ఈ  ఆర్బీకేలు రైతులకు ఏదైనా కొనుగోలు చేయాలంటే కూడా విత్తనాలు దగ్గర నుంచి ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ ఏదైనా సరే కొనుగోలు చేసేటప్పుడు  రైతు మోసపోకూడదన్నారు. క్వాలిటీ లేని వస్తువులు రైతు కొనుగోలు చేసే పరిస్ధితి ఉండకూడదన్న తాపత్రయంతో ఆ సీడ్‌ కాని, ఫెర్టిసైడ్‌ కాని, ఫెర్టిలైజర్‌ను కూడా గవర్నమెంట్‌ టెస్ట్‌ చేసి, గ్యారంటీ ఇచ్చి ఈ క్వాలిటీ స్టాండర్డ్‌ మీద గవర్నమెంట్‌ స్టాంప్‌ వేసి, వాటిని గ్రామాలలో రైతులు ఆర్డర్‌ ప్లేస్‌ చేసిన వెంటనే 48 గంటల నుంచి 72 గంటలలోపు పూర్తిగా అందుబాటులోకి తీసుకుని వచ్చి గ్రామంలోనే రైతుకిచ్చే పరిస్ధితి కనిపిస్తుందని సిఎం చెప్పారు.

ఆర్బీకేల్లోనే అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు కూర్చుంటారని, ఇ– క్రాపింగ్‌ విధానం ఇక్కడ నుంచే జరుగుతుందని చెప్పారు.   ఆర్బీకేల్లో స్మార్ట్‌ టీవీలు పెడుతున్నాం కాబట్టి అక్కడ రైతులకు సంబంధించి చాలా విషయాల మీద అంటే పంటలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణం ఎలా ఉంటుందని తెలియజెప్పే పరిస్ధితులు కానీ, వీటన్నింటి మీద నిరంతరం సమాచారం ఇచ్చే కార్యక్రమాలు RBK Channel ద్వారా సాధ్యపడతాయని తెలిపారు.

రైతుల సందేహాలను పరిష్కరించేందుకు ఒక టోల్‌ ప్రీ నంబరు 155251 ఏర్పాటు చేశామని కూడా సిఎం గుర్తు చేశారు. ఇది కాక ఆర్బీకేల్లోనే రైతులు ఏవైనా సందేహాలుంటే మన సైంటిస్ట్‌లతో ఇంటరాక్టివ్‌ పద్ధతిలో కూడా సందేహాలు తీర్చడానికి ఒక వ్యవస్ధను పటిష్టంగా ఏర్పాటు చేయాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి గారికి, సెక్రటరీ గారికి ఇద్దరికీ సిఎం ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ కోన శశిధర్, మార్కెటింగ్, సహకార శాఖ స్పెషల్‌ సెక్రటరీ వై మధుసూదన్‌రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ  ఏ సూర్యకుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.