Connect with us

ఆంధ్రప్రదేశ్

ఇక ఎక్కడైనా రేషన్ !

Published

on

Spread the love

రాష్ట్రంలో నిన్నటి మొన్నటి వరకూ రేషన్ బియ్యం ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు ఉండేది. అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారేవరైనా గుంటూరు జిల్లాకు వలస వచ్చి ఉంటే శ్రీకాకుళం జిల్లాలో వారికి ఉన్న రేషన్ కార్డు తోనే గుంటూరులో రేషన్ తీసుకునే వీలుండేది. అయితే రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు వ్యవస్థ ఏర్పడటం , ఇప్పుడు వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇచ్చే పద్ధతి ప్రారంభించడంతో కొన్ని చిక్కులు వచ్చాయి. దీంతో రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడే మ్యాపింగ్ చేయించుకుని అక్కడే వారి ఇంటి వద్దనే రేషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ విధానంతో వలస కార్మికులు రేషన్ తీసుకునే వీలులేకుండా పోయింది. సగానికి సగం కార్డు ధారులు రేషన్ సరుకులు తీసుకోకపోవడానికి ఇదే ప్రధాన కారణం.

ఈ సమస్యను సకాలంలో గుర్తించిన రాష్ట్ర ప్రజా పంపిణీ శాఖ పరిష్కార చర్యలు చేపట్టింది.

రైస్ కార్డ్ ఎక్కడ mapping అయినా పర్వాలేదు ఏ MDU (రైస్ వాహనం) దగ్గర అయినా రైస్ తీసుకొనే సదుపాయం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్లస్టర్ తో సంబంధం లేకుండా ఏ వాహనం దగ్గర అయినా ఎవరూ అయినా రైస్ తీసుకోవచ్చు. పూర్తి వివరాలకు మీకు దగ్గరలోని వాలంటీరును సంప్రదించండి .