Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆలయాల నిర్వహణకు ప్రత్యేక డిజిటిల్ వ్యవస్థ

Published

on

Spread the love

15–03–2021

అమరావతి : రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థన మందిరాలను సక్రమంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘టెంపుల్ మేనేజ్మెంట్’ పేరుతో సరికొత్త డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని రకాల ఆలయాలు ఈ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వస్తాయి. ఈ సందర్భంగా అన్నవరం ఆలయానికి రూ.10,116 మొత్తాన్ని క్యూాఆర్ కోడ్ స్కాన్ చేసి ఇ-హుండీ ద్వారా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సమర్పించింది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్ సేవలను యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందించనుంది.

ఆలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్‌బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థలో ఉంటాయి.

టెంపుల్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చే మరికొన్ని సేవలు

  • భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించవచ్చు
  • క్యూ–ఆర్‌ కోడ్‌ ద్వారా ఇ– హుండీకి కానుకలు పంపవచ్చు
  • యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలు
  • తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ
టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్

అవినీతి నివారణకు దోహదం చేస్తుంది : జగన్

ఆలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ టెంపుల్ మేనేజ్మెంట్ వ్యవస్థ దోహదం చేస్తుందని ప్రారంభోత్సవంగా సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్‌ కమిషనర్‌ అర్జున రావు, యునియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండి అండ్‌ సిఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్‌ జి, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్‌ వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్‌ఎల్‌బిసి ఏజీఎం అండ్‌ కోఆర్డినేటర్‌ ఇ.రాజుబాబు, రీజనల్‌ హెడ్‌  వి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.