Connect with us

ఆంధ్రప్రదేశ్

పింగళి భారత రత్నం

Published

on

Spread the love

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య భరతజాతి ఆణిముత్యం అని, ఆయనకు భారతరత్న పురష్కారం ప్రకటించి గౌరవించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పింగళికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రికి శుక్రవారం ఆయన ఒక లేఖ రాశారు.

పింగళి కుటుంబ సభ్యులను కలిసిన సిఎం

దేశానికి జాతీయ జెండాను అందించిన మహనీయులు పింగళి వెంకయ్య కుటుంబానికి చాలాకాలం తర్వాత ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలకరింపుతో వారి కుటుంబీకులు సంతృప్తి వ్యక్తం చేశారు. సిఎం చేతులు పట్టుకున్న వెంకయ్య కుమార్తె, 99 ఏళ్ల ఘంటసాల సీతామహాలక్ష్మీ కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని దశాబ్ధాల తర్వాత తనను పలకరించావంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమత్‌ మహోత్సవ్‌’ పేరుతో వేడుకలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు శుక్రవారం సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీతామహాలకీëని సత్కరించి జ్ఞాపికను అందించారు. భారతమాత ఒడిలో పింగళి వెంకయ్య ఉన్న పెయింటింగ్‌, దండి సత్యాగ్రహాంలో మహాత్మ గాంధీతో పాటు పింగళి వెంకయ్య పాల్గొన్న పెయింటింగ్‌ను అందించారు. సీతామహాలక్ష్మీ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సీఎం కాదు, ఒక ఆత్మీయుడుగా పలకరించారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబీకులు సిఎంతో సెల్ఫీలు దిగారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం మహాత్మ గాంధీజీ అందించి వందేళ్లు (మార్చి 31వ తేదికి) పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని బాపు మ్యూజియంలో జరిగే కార్యక్రమానికి పింగళి వెంకయ్య కుటుంబీకులను సిఎం ఆహ్వానించినట్లు సీతామహాలక్ష్మీ కుమారుడు జీవీఎన్‌ నరసింహం తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎం.సుచరిత, ఎ.శ్రీనివాస్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ బార్గవ్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌, జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభ ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాదు, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, విడదల రజని, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెసిలు ఎఎస్‌ దినేష్‌ కుమార్‌, పి.ప్రశాంతి, మధ్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.

పింగళి కుటుంబ సభ్యులతో కలిసి దండి మార్చ్ చిత్రాన్ని
ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి జగన్