Connect with us

Editors Pick

పల్లెకూ రిజర్వేషన్

Published

on

Spread the love

ఆర్టీసీ టిక్కెట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి రిజర్వేషన్ పద్ధతులను రైల్వే తరహాలో చేపట్టేందుకు ఆర్టీసీ ఒక ప్రాజెక్ట్ చేపడుతోంది. దీనికి రూ.70 కోట్లు ఖర్చు కానుంది. డిజిటల్ ఎకో సిస్టమ్ ప్రోత్సాహం కింద రూ.15 కోట్లు దాకా కేంద్రం ఇస్తుందని అధికారులు తెలిపారు. . టికెట్ బుకింగ్ కు, బస్ ట్రాకింగ్ కు, బస్పర్లకు, ఫిర్యాదులకు వేర్వేరు వెబ్ సైట్లను ఎంచుకోవాల్సి వచ్చేది. ఇపుడు ఆర్టీసిలో లభ్యమయ్యే దాదాపు 15 రకాల సేవలు ఒకే వెబ్ సైట్లో లభ్యమయ్యేలా ఆర్టీసి కొత్త వెబ్ సైట్ ను తయారు చేస్తోంది. ఇందుకోసం యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (యుటిఎస్) విధానాన్ని రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు కింద క్యూఆర్ కోడ్లో కూడా టికెట్ పొందే వీలుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. యుటిఎస్ విధానంలో బస్ బయలుదేరాక కూడా దూరప్రాంతాలకు అయినా, స్థానిక సర్వీసులకు అయినా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా దూరప్రాంత సర్వీసులకు బస్ బయలుదేరక ముందు 15 నిమిషాల ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు వుండేది. కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి వస్తే బస్సు బయలు దేరాక కూడా సీట్లు ఎన్ని ఖాళీలు వున్నాయో చూపుతుంది. రైల్వే తరహాలో రిజర్వేషన్ అప్ డేట్ ను తెలుసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుడికి బస్ మిస్సయితే .. అదే రూట్లో వెనుకవస్తున్న మరో బస్లో ఖాళీ వుంటే అందులో ప్రయాణించవచ్చు. ఎపిఎస్ ఆర్టీసిలో రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలను సాగిస్తారు. ఇపుడు ఇందులో దాదాపు 1.50 లక్షల సీట్లను మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం వుంది. కొత్త ప్రాజెక్టులో పల్లె వెలుగు, సిటి బస్టు మొదలుకొని అమరావతి, నైట్ రైడర్,

డాల్ఫిన్ లాంటి ఆధునిక వసతులు వున్న బస్ వరకు అన్ని సర్వీసుల్లోని 60లక్షల సీట్లను రిజర్వేషన్ కోసం ఆన్లైన్లో అందుబాటులో వుంచనున్నారు. కొత్త ప్రాజెక్టు యుటిఎలో టికెట్లు ఇచ్చే టిమ్ మిషన్ స్థానంలో బస్ కండక్టర్‌కుగాని, డ్రైవర్‌కు గాని ఈ పోస్ మిషన్లను ఇస్తారు. ఇవి ప్రధాన కార్యాలయంలోని మెయిన్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో బస్ ఎక్కడ పోతుంది అందులో ఎంత మంది వున్నారు….ఎన్ని సీట్లు ఖాళీ వున్నాయి అనే సమాచారం కమాండ్ కంట్రోల్ కు ఎప్పటికప్పుడు సమాచారం వెలుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ 70 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.