Connect with us

కేరళ

కేరళ బరిలో కొత్త రక్తం

Published

on

image
Spread the love

సిపిఎం జాబితాలో సగం మంది కొత్త వారే !

తిరువనంతపురం; మార్చి 10: కేరళ శాసనసభలో ఈ దఫా కొత్త ముఖాలతో, నల్లని జుత్తు ఉన్న సభ్యులతో నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో యువతను, కళాకారులను, విద్యావంతులను, మహిళలను ఇలా అన్ని సామాజిక తరగతుల సమవుజ్జీ సమీకరణలతో శాసన ఎన్నికల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 83 మందితో అభ్యర్థుల జాబితాను బుధవారం నాడు విడుదల చేసింది.

కేరళలో 15 వ అసెంబ్లీ ఎన్నికలకు కోసం విడుదల చేసిన ఈ జాబితాలో ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కూడా అయిన పినరయి విజయన్ అలాగే కోవిడ్ నియంత్రణలో ఐక్యరాజ్యసమితి ప్రశంసలతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన కెకె శైలజా టీచర్ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు సిపిఎం అధికార దినపత్రిక ‘దేశాభిమాని’ సంపాదకులు పి రాజీవ్, విజయన్ అల్లుడు , యువజన నాయకుడు రియాజ్ , అరుణ్ కుమార్, కెెఎన్ బాలగోపాలన్, తదితరులున్నారు. అయితే సిట్టింగ్ లలో కొందరు మంత్రులతో సహా చాలా మందిని పక్కన బెట్టారు. వారికి పార్టీ పదవులను కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది.

140 మంది సభ్యుల శాసనసభకు సిపిఐ (ఎం) 85 మంది అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో పార్టీ అభ్యర్థులుగా 74 మంది పోటీ చేస్తారని, 9 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తారని, మంజేశ్వరం, దేవికుళం నియోజకవర్గాల అభ్యర్థులను తరువాత ప్రకటిస్తామని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎ విజయరాఘవన్ తెలిపారు. 12 మంది మహిళా అభ్యర్థులకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. కన్నూర్ జిల్లాలో తన సిట్టింగ్ సీటు ధర్మదాంలో పినరయి విజయన్ పోటీపడనున్నారు. మత్తన్నూర్ నుంచి సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె కె శైలజా పోటీపడనున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎం వి గోవిందన్, కె. రాధాకృష్ణన్ వరుసగా తాలిప్పరంబు, చెలక్కర నుండి పోటీ పడతారు. విద్యుత్ శాఖ మంత్రి ఎం ఎం మణి, కార్మిక, ఎక్సైజ్ మంత్రి టి పి రామకృష్ణన్ వరుసగా ఉడుంబంచోల, పెరంబ్రాలో పోటీ పడతారు.

సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. రాజీవ్ (కలమసేరి), కెఎన్ బాలగోపాల్ (కొట్టారక్కర), మత్స్యశాఖ మంత్రి జె. మెర్సికుట్టి అమ్మ, పంచాయతీ మంత్రి ఎసి మొయితీన్ (కున్నంకుళం), దేవస్వం మంత్రి కదకంపల్లి సురేంద్రన్ (కజవూగూటెల్) ), ఫిల్మ్ స్టార్ ఎం ముఖేష్ (కొల్లం), ప్లే బ్యాక్ సింగర్ దలీమా జోజో (అరూర్) కూడా ప్రజల తీర్పు కోరనున్నారు.

ఇద్దరు వైద్య నిపుణులు డాక్టర్ జె జాకబ్ (త్రికక్కర), డాక్టర్ సుజిత్ విజయన్ (చవారా) కూడా రంగంలో ఉన్నారు. విద్యార్థులు, యువజన సంస్థలకు చెందిన 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వారిలో నలుగురు 30 ఏళ్లలోపు వారు. వీరు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సచిన్ దేవ్ (బలూసేరి), జైక్ సి థామస్ (పుత్తుపల్లి), లిండో జోస్ (తిరువంబాడి), మిథునా (వండూర్). ఐదుగురు మంత్రి, 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను అభ్యర్థుల జాబితా నుండి మినహాయించారు.

Candidate List follows:

ManjeswaramKasargodCPIMTo be declared
UdmaKasargodCPIMCH Kunjambu
ThrikaripurKasargodCPIMM Rajagopalan
PayyanurKannurCPIMT I Madhusoodhanan
KalliasseriKannurCPIMM Vijin
TaliparambaKannurCPIMM V Govindan Master
AzhikodeKannurCPIMK V Sumesh
DharmadomKannurCPIMPinarayi Vijayan
ThalasseryKannurCPIMA N Shamseer
MattanurKannurCPIMK K Shailaja
PeravoorKannurCPIMSakkeer Hussain
MananthavadyWayanadCPIMOR Kelu
Sulthan BatheryWayanadCPIMMS Viswanathan
KoyilandyKozhikodeCPIMKanathil Jameela
PerambraKozhikodeCPIMTP Ramakrishnan
BalusseryKozhikodeCPIMSachin Dev
Kozhikode NorthKozhikodeCPIMThottathil Raveendran
BeyporeKozhikodeCPIMP A Mohammed Riyaz
KoduvallyKozhikodeCPIM (IND)Karat Rasaq
KunnamangalamKozhikode(IND)P T A Rahim
ThiruvambadyKozhikodeCPIMLinto Joseph
KondottyMalappuramCPIM (IND)Sulaiman Haji
NilamburMalappuramCPIM (IND)PV Anwar
WandoorMalappuramCPIMP Mithuna
PerinthalmannaMalappuramCPIMK P Muhammad Musthafa
MankadaMalappuramCPIMRasheed Ali
MalappuramMalappuramCPIMPaloli Abdurahman
VengaraMalappuram CPIMP Jiji
TanurMalappuramCPIM (IND)V Abdurahman
TirurMalappuramCPIM (IND)Gafur Lilys
ThavanurMalappuramCPIM (IND)K T Jaleel
PonnaniMalappuramCPIMP Nandukumar
ThrithalaPalakkadCPIMMB Rajesh
ShornurPalakkadCPIMP Mammikkutty
OttapalamPalakkadCPIMPremkumar
KongadPalakkadCPIMSanthakumari
MalampuzhaPalakkadCPIMA Prabhakaran
PalakkadPalakkadCPIMC P Pramod
TarurPalakkadCPIMP P Sumod
NenmaraPalakkadCPIMK Babu
AlathurPalakkadCPIMK D Prasenan
ChelakkaraThrissurCPIMK Radhakrishnan
KunnamkulamThrissurCPIMAC Moideen
GuruvayurThrissurCPIMM K Akbar
ManalurThrissurCPIMMurali Perunelli
WadakkancheryThrissurCPIMXavier Chittilappalli
IringalakkudaThrissurCPIM Dr. R Bindu
PuthukkadThrissurCPIMK K Ramachandran
AluvaErnakulamCPIMShelna Nishad
KalamasseryErnakulamCPIMP Rajeev
VypinErnakulamCPIMKN Unnikrishnan
KochiErnakulamCPIMKJ Maxi
ThrippunithuraErnakulamCPIMM Swaraj
ErnakulamErnakulamCPIM (IND)Shaji George
ThrikkakaraErnakulamCPIMDr. J Jacob
KunnathunadErnakulamCPIMPV Sreenijan
KothamangalamErnakulamCPIMAntony John
DevikulamIdukkiCPIMTo be declared
UdumbancholaIdukkiCPIMMM Mani
EttumanoorKottayamCPIMV N Vasavan
KottayamKottayamCPIMK Anil Kumar
PuthuppallyKottayamCPIMJaick C Thomas
AroorAlappuzhaCPIMDalima Jojo
AlappuzhaAlappuzhaCPIMP P Chitharanjan
AmbalappuzhaAlappuzhaCPIMH Salaam
KayamkulamAlappuzhaCPIMU Prathibha
MavelikaraAlappuzhaCPIMM S Arunkumar
ChengannurAlappuzhaCPIMSaji Cherian
AranmulaPathanamthittaCPIMVeena George
KonniPathanamthittaCPIMK U Janishkumar
ChavaraKollamCPIM (IND)Dr. Sujith Vijayan
KottarakkaraKollamCPIMKN Balagopal
KundaraKollamCPIMJ Mercykutty Amma
KollamKollamCPIMM Mukesh
EravipuramKollamCPIMM Naushad
VarkkalaThiruvananthapuramCPIMV Joy
AttingalThiruvananthapuramCPIMO S Ambika
VamanapuramThiruvananthapuramCPIMD K Murali
KazhakkoottamThiruvananthapuramCPIMKadakampalli Surendran
VattiyoorkkavThiruvananthapuramCPIMV K Prasanth
Nemom ThiruvananthapuramCPIMV Sivankutty
AruvikkaraThiruvananthapuramCPIMG Stephen
ParassalaThiruvananthapuramCPIMC K Hareendran
KattakkadaThiruvananthapuramCPIMI B Sathish
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *