Connect with us

ఆంధ్రప్రదేశ్

సృష్టికి మూలం అమ్మ

Published

on

Spread the love
  • మహిళా దినోత్సవ వేడుకల్లో తమ్మినేని
    అమరావతి,మార్చి8 : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, లక్ష్యాల వైపు దూసుకుపోవాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ పిలుపు నిచ్చారు. అసెంబ్లీ కమిటి సమావేశ మందిరంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పి. బాలకృష్ణమాచార్యులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అని, అటువంటి అమ్మను పూజించడం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయమని తెలిపారు. మహిళలు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో రాణించాలని అభిలషించారు. మహిళలపై తమకున్న గౌరవాన్ని చాటిచెప్పేలా రెండు రోజుల్లో వారికి ప్రత్యేక ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మగవారితో సమానంగా మహిళలు పని చేస్తున్నారని కొనియాడారు. మహిళా మహనీయులు రాణీ రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీభాయి, సరోజనీ నాయుడు, ఇందిరా గాంధీలు దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. అనంతరం అసెంబ్లీలో అత్త్యున్నత సేవలను అందించిన మహిళా అధికారిణిలు శకుంతల, సాయిలక్ష్మీలను శాలువాలతో సత్కరించి,మెమంటోలను అందజేశారు. మహిళలు తెచ్చిన ప్రత్యేక కేక్ ను కట్ చేశారు.
అసెంబ్లీ కార్యాలయ మహిళా సిబ్బందితో స్పీకర్ తమ్మినేని గ్రూపు ఫొటో