Connect with us

ఆంధ్రప్రదేశ్

సమీకృత సమాచార కేంద్రాలు

Published

on

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వివిధ శాస్త్ర సాంకేతిక అంశాలపై రైతులకు వచ్చే పలు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సమీకృత రైతు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమాచార కేంద్రాల్లో ఈ క్రింద పేర్కొన్న సేవలు లభిస్తాయి.

అవి :

1·   ఉద్యాన పంటల సాగు, పశు ఆరోగ్యం, మత్స్త్య రంగం, పట్టు పరిశ్రమ మరియు మార్కెటింగ్ తదితర అంశాలపై సందేహాలను నివృత్తి . సూచనలు,సలహాలు.

2·  విషయ నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయి.

3·   క్లిష్టమైన సమస్యలపై కూడా అవసరమైతే సంబంధిత పరిశోధనా సంస్థల ప్రధాన శాస్త్రవేత్తల ద్వారా 24 గంటల లోపు పరిష్కారం.

4· ప్రశ్నకు అవసరాన్నిబట్టి SMS ద్వారా సమాధానం.

5. ఉచిత ఫోన్ నంబరు 155251 కు ఫోన్ చేసి తగిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ నంబరుకు ఫోన్ చేస్తే ఛార్జీలు పడవు.

6. సమాచార కేంద్ర సేవలు ప్రతి రోజూ (సెలవు రోజులు మినహాయించి) ఉదయం 7 గoటల నుండి సాయంత్రం 7గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

·         రైతులు నేరుగా వ్యవసాయ క్షేత్రం నుండి సమస్య ఉన్న పంట ఫోటోలు తీసి వాట్సాప్ (WHATSAPP) ద్వారా ఈ క్రింద పేర్కొన్న నంబర్లకు రైతు వివరాలతో సహా పంపి తగిన సలహాలు,సూచనలు  పొoదవచ్చు.

·         వాట్సాప్ నంబర్లు ( ఈ నంబర్లు గుంటూరు జిల్లా పరిధిలోని రైతులకు ఉద్దేశించినవి. మీమీ జిల్లాల నంబర్ల కోసం స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు)

·         8331056028 ·   8331056149 ·  8331056150

·         8331056152 ·   8331056153 · 8331056154