Connect with us

రాజకీయం

రేషన్ వాహనాల్లో డబ్బులు

Published

on

Spread the love

విశాఖ జిల్లా నర్సీపట్నంలో గమ్మత్తు చోటుచేసుకుంది. సాధారణంగా బియ్యం తీసుకచ్చే రేషన్ వాహనాలు మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని డబ్బులు తీసుకొచ్చాయి. ఆసక్తి కలిగించే ఈ సంగతి వెనుక అసలు విషయమిది.

టిడిపి నేతలు పట్టుకున్న బియ్యం పంపిణీ వాహనం వద్ద సందడి

ఈ వాహనాల ద్వారా కార్యకర్తలకు వైసిపి డబ్బులు పంచుతోందని టిడిపి ఆరోపించింది. అంతేకాదు డబ్బులు పంపిణీ చేసిన వారిని పోలీసులకు అప్పగించారు టిడిపి కార్యకర్తలు. సదరు రేషన్ బియ్యం పంపిణీ వాహనాన్ని మునిసిపల్ కార్యాలయనికి అప్పగించారు. 22 వ వార్డు కి సంబందించిన సరుకుల వాహనం 26 వ వార్డు లో తిరుగుతుండటంతో స్థానిక టిడిపి నేతలకు అనుమానం వచ్చి సోదాలు జరిపారు. దీంతో అసలు సంగతి బయటపడింది. దీనిపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆగడాలకు హద్దులేకుండా పోతోందని ఆరోపించారు. మునిసిపల్ కార్యాలయం ముందు నడి రోడ్డు పై పడుకుని ఆయన నిరసన తెలిపారు. బియ్యం బదులుగా డబ్బులు పంపిణీ చేసి ఓట్ల కొనుగోలుకు యత్నించిన వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.