Connect with us

ఆంధ్రప్రదేశ్

‘నివర్‌’ తుపాను నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

Published

on

Spread the love

అమరావతి:

‘నివర్‌’ తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్‌ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు హాజరు.

తుపాను కదలిక, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై అధికారులతో విస్తృతంగా సమీక్షించిన సీఎం

సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, వ్యవసాయ, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరు.

సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌..:

తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, తమిళనాడుకు చేరువలోనూ, సముద్ర తీర ప్రాంతాలలోనూ దాని ప్రభావం ఉంటుంది, భారీ వర్ష సూచన కూడా ఉంది: సీఎం

ఈ నేపథ్యంలో మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి:

రేపు (బుధవారం) సాయంత్రం నుంచి, ఎల్లుండి (గురువారం) అంతా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు:

వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయి :

దీనికి మనం సన్నద్ధంగా ఉండాలి:

నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 11–20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం:

అలాగే గంటకు 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది: సీఎం

పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవాలి :

ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి:

కోత కోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి:

ఒక వేళ పంటలు కోయకుండా అవి పొలంలోనే ఉంటే.. వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి:

ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది:

అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ వర్షాలు పడితే.. చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉంటాయి:

ఆ గండ్లు పడకుండా నిరంతరం మానిటర్‌ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి:

కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోండి:

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దిశా నిర్దేశం చేయండి:

వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోండి:

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసుకోండి :

అలాగే కరెంటు సరఫరాకు అంతరాయం కలిగితే, వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధం చేసుకోండి:

ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రోజంతా పని చేసే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసుకోండి:

మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఉండాలి :

నెల్లూరు నుంచి తూర్పుగోదావరి వరకూ వర్షాలు ఉండే అవకాశాలున్నాయి:

ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించేలా తగిన పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచుకోండి:

తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌ను అన్ని గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచారు. ఆ సమాచారం సిబ్బందికి, ప్రజలకు చేరవేసేలా చూడాలి:

రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు లాంటి ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి:

నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చోట్ల సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి :

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *