పర్యాటకం
చిన్నశేష వాహనంపై అఖిలాండ నాయకుడు


తిరుమలలోని శ్రీనివాస మంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో అలంకరణ చేసి చిన్నశేష వాహనంపై ఆలయ అర్చకులు భక్తజన నడుమ ఊరేగించారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవ ఆలయంలో ఈ కార్యక్రమ నిర్వహించారు.


రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి విగ్రహాన్ని మాత్రమే ఐదు తలలు గల చిన్నశేష వాహనానంపై అదిష్టించి వైభవపేతంగా వేడుక నిర్వహించారు. చిన్నశేష వాహనాన్ని పాంచ భౌతిక ప్రకృతికి సంకేతంగా చెబుతారు. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే సకల జీవకోటికి ప్రతీక.


Continue Reading