Connect with us

Editors Pick

కొనసాగుతున్న రైతు ఉద్యమం

Published

on

Spread the love

న్యూఢిల్లీ :

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించుకున్న రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ చట్టాలతో రైతులకు నష్టం కలుగుతోందని, కార్పొరేట్లకు లాభం చేకూరుతుందని, వీటిని రద్దు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టాలపై తగిన చర్చ జరగకుండా, దాని నిబంధనలను వివరించకుండా త్వరగా ఆమోదించబడ్డాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత రూపంలో ఈ చట్టాల అమలు వల్ల, సమాంతర మార్కెట్‌ను తెరవడం ద్వారా సమాజానికి విపత్తును కలిగిస్తుందని, దేశ రైతాంగాన్ని దోచుకునేందుకు తగిన అవకాశం కల్పిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని, వీటి ప్రకారం రైతు వ్యతిరేక రైతులు బహుళజాతి కంపెనీల కార్పొరేట్ దురాశకు గురవుతారని పేర్కొన్నారు. ఈ చట్టాలు వ్యవసాయ ఉత్పత్తులకు సరసమైన ధరలను భీమా చేయడానికి ఉద్దేశించిన వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (ఎపిఎంసి) వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని పిటిషన్ లో  పేర్కొన్నారు. 

ఎంఎస్పిపై పార్లమెంట్‌లో హామీ ఇచ్చాం: తోమర్

ఎంఎస్పిపై పార్లమెంట్‌లో హామీ ఇచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. “ప్రధాని దీని గురించి మాట్లాడారు.  నేను ఉభయ సభల్లో హామీ ఇచ్చాను. ఇది పార్లమెంటులో చెప్పబడిందంటే, అది రికార్డ్ చేసిన డాక్యుమెంట్. ఇది ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అంతకన్నా శక్తివంతమైన డాక్యుమెంట్ మరొకటి ఉండదు. ఎంఎస్పి కొనసాగుతుంది. దీన్ని ఎవరూ అనుమానించకూడదు” అని తోమర్ అన్నారు.
రైతులు వెతుకుతున్న సవరణల డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతిచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిశీలిస్తాయని, అవి తిరిగి చర్చలకు వస్తాయని, ఇష్యూ త్వరలో పరిష్కరించబడుతుందని నేను ఆశిస్తున్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల పెరుగుతున్న అభిమానంతోనూ, ఇమేజ్‌తోనూ ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రైతు ఆందోళన ద్వారా అవకాశం తీసుకుంటున్న దేశ వ్యతిరేక అంశాలపై జాగ్రత్తగా ఉండాలని తాను రైతు సంఘాలను కోరుతున్నానని, ఇది రైతుల ప్రయోజనాలకు ఆటంకం కలిగించవచ్చని అన్నారు. ప్రభుత్వం స్వచ్ఛమైన మనస్తత్వంతో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని, రైతు నేతలు-ప్రభుత్వ ఆరో రౌండ్ సమావేశంలో వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించిందని అన్నారు. తాము తమ ప్రతిపాదనను రైతు సంఘాలకు పంపించామని, కాని వారు తమ ప్రతిపాదనలను తిరస్కరించారని పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అన్నారు. చర్చల ద్వారా ఈ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రైతు ఆందోళనలు చాలా రోజులుగా జరుగుతున్నట్లు మనందరికీ తెలుసని చెప్పారు. తాము నిరంతరం రైతులతో మాట్లాడుతున్నామని, వ్యవసాయ చట్టాల గురించి ప్రతిదీ వివరించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నామని చెప్పారు. రైతు ఆందోళనలు సామాన్య ప్రజలకు కూడా సమస్యలను కలిగిస్తుందని, ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాబట్టి, రైతులు సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం తమ ఆందోళనలను ముగించి, చర్చల సహాయంతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని తోమర్ సూచించారు. “ఈ ప్రతిష్టంభనను అంతం చేయడానికి మేము ఒక మార్గాన్ని కనుగొంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రతిష్ఠంభనను తొలగించాలని నేను రైతులను కోరుతున్నాను. రైతులకు లభించే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాలను రూపొందించాము” అని తోమర్ అన్నారు. “శీతాకాలం ప్రారంభమైంది. మేము కోవిడ్ -19తో పోరాడుతున్నాం. ఈ నిరసనలతో ప్రజలు సంతోషంగా లేరు. రైతులు నిరసనను ముగించాలి” అని కోరారు.

చట్టాలు రద్దు చేశాకనే చర్చలు: హన్నన్ మొల్లా

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేశాకనే చర్చలకు వెళ్తామని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా స్పష్టం చేశారు. చరచల మీద చర్చలు జరపడం వల్ల ఉపయోగమేమీ లేదని, తమ డిమాండ్ స్పష్టంగా ఉందని అన్నారు. “ప్రభుత్వం చర్చలకు సిద్ధమేనని ప్రకటిస్తుంది. తాము కూడా చర్చలకు సిద్ధంగానే ఉన్నా. అయితే అంతకంటే ముందే మూడు చట్టాలు రద్దు చేయాలి. అప్పుడు చర్చలకు వస్తాం. వాటి స్థానంలో కొత్త చట్టాలు తెచ్చేందుకు సూచనలు ఇస్తాం. రైతుల సూచనలతో రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్త చట్టాలు తెచ్చేందుకు సలహాలు ఇస్తాం. ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకం, కార్పోరేట్ అనుకూలం” అని పునరుద్ఘాటించారు. చట్టాలను ప్రభుత్వం రద్దు చేస్తే, రైతులు వెంటనే స్వస్థలాలకు తిరిగి వస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ అన్నారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వాదనకు ఎఐకెఎస్ సిసి తప్పు పట్టింది. తాము స్పష్టంగానే ఉన్నామని, ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించని స్పష్టం చేసింది. రైతు సంఘాలు ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం పిలిచిన ప్రతిసారీ చర్చలకు వచ్చామని స్పష్టం చేసింది. మూడు వ్యవసాయ‌ చట్టాల రద్దు, విద్యుత్ బిల్లు ఉపసంహరణ రైతుల ప్రధాన డిమాండ్  అని, వాటిని రద్దు చేయకుండా కొనసాగించడంలో ప్రభుత్వం మొండిగా ఉందని స్పష్టం చేసింది. 

రైతుల సహనాన్ని పరీక్షించవద్దు: పవార్

అన్నదాతల సహనాన్ని పరీక్షించవద్దని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  రైతుల డిమాండ్లపై కేంద్రం సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన మరింతగా వ్యాపించవచ్చని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు వాటిపై సవివరమైన చర్చకు పిలుపునిచ్చినప్పటికీ సంబంధిత వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో తొందరపాటుతో ఆమోదించారని ఆయన అభిప్రాయం పడ్డారు.

కొనసాగుతున్న రైతు ఉద్యమం

మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు ఉద్యమం ఉధృతం అవుతోంది. గత 16 రోజులుగా దేశ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమం శుక్రవారం కూడా కొనసాగింది. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళనలు చేయడంతో దేశ రాజధానిలోని అనేక మార్గాలు మూసివేశారు. వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలు సింఘూ, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఘాజిపూర్, చిల్లా (ఢిల్లీ-నోయిడా) వద్ద దాదాపు రెండు వారాల పాటు ఆందోళనలు చేస్తున్నారు. సింఘూ, టిక్రీ, ఖాజీపూర్, పాల్వాల్ లోని ఆందోళనల్లో  కొత్తగా వేలాది మంది రైతులు చేరారు. తమిళనాడు నుండి రైతులు వచ్చి చేరారు. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుండి రైతుల బృందాలు ఢిల్లీ నిరసనలో చేరడానికి త్వరలో వస్తాయి. శుక్రవారం మరో మరో 50 మంది రైతులు పంజాబ్ నుండి ఢిల్లీకి పయనమైయ్యారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యుల మరో బృందం పంజాబ్ నుండి ఢిల్లీకి వస్తున్నట్లు ఆ సంఘం నేత ఎస్ఎస్ పాంధర్ పేర్కొన్నారు. “సుమారు 700 ట్రాక్టర్ ట్రాలీలు, ఇతర వాహనాలతో రైతులు ఢిల్లీ కుండ్లి సరిహద్దు వైపు వస్తున్నాం. సుమారు 50 వేల మంది రైతులు కుండ్లి సరిహద్దుకు వెళ్తాం. శుక్రవారం పంజాబ్ లోని శంభు సరిహద్దును దాటుతాము. మేము రాత్రికి హర్యానాకి చేరుకుంటాం. మరుసటి రోజు ఉదయం మేము కుండ్లి సరిహద్దు వైపు వెళ్తాం” అని ఎస్ఎస్ పాంధర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వేగంగా ఏదో ఒకటి చేయాలని బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కోరారు. రైతుల కోసం స్వరం పెంచిన ప్రముఖుల శ్రేణిలో చేరిన బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మాట్లాడుతూ “నా రైతు సోదరుల బాధలను చూడటం నాకు చాలా బాధగా ఉంది. ప్రభుత్వం వేగంగా ఏదో ఒకటి చేయాలి” అని అన్నారు. టోల్ ప్లాజా ఉచిత రాకపోకలు, జైపూర్-ఢిల్లీ హైవే దిగ్బంధనం, అన్ని జిల్లాల్లోని ధర్నాలు, డిసెంబర్ 14 నిరసనలకు పూర్తిస్థాయిలో సన్నాహాలు పూర్తి అయినట్లు ఎఐకెఎస్ సిసి పేర్కొంది. కలకత్తాలో డిసెంబర్ 16న రాజ్ భవన్‌కు భారీ కవాత్ నిర్వహిస్తామని, డిసెంబర్ 15న ముంబాయిలో భారీ నిరసన ఉంటుందని పేర్కొంది. రైతు ఆందోళనలకు పది కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి ఈ మేరకు శుక్రవారం సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, ఎఐయుటియుసి, టియుసిసి, ఎస్ఈడబ్య్లుఎ, ఎఐసిసిటియు, ఎల్ఫిఎఫ్, యుటియుసి సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

ప్రచారానికి బిజెపి యత్నం

ఉద్యమిస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రతిష్టంభనకు ముగింపు లేకుండా, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా బిజెపి భారీ ప్రచారం చేపట్టబోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో అధికార పార్టీ నుండి పెద్ద ఎత్తున 700 జిల్లాల్లో 100 విలేకరుల సమావేశాలు, 700 రైతు సమావేశాలు ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ మంత్రులు కూడా కమ్యూనికేషన్ ప్రచారంలో పాల్గొంటారని బిజెపి వర్గాలు తెలిపాయి. 

ReplyForward
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *