Connect with us

ఫీచర్లు

లఘు చిత్రాల పోటీల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

Published

on

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల నియమ నిబంధనలను అనుసరించి 2020వ సంవత్సరానికి గాను  రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  “నవరత్నాలు” అభివృద్ది పధకాలపై  తెలుగు భాషలో 3 నుండి 5 నిమిషాల వ్యవధిలో లఘు చిత్రo నిర్మించిన వ్యక్తులు / సంస్థల నుండి దరఖాస్తులు పంపాలని కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి.వి. మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లఘు చిత్రాల నియమ నిబంధనలనలతో పాటుగా దరఖాస్తుల కొరకు మా సంస్థ వెబ్ సైట్ www.apsftvtdc.in ను చూడగలరు. దరఖాస్తులను ఆన్ లైన్లో పంపాలి.

పూర్తి చేసిన దరఖాస్తుతో పాటుగా చిత్రీకరించిన లఘు చిత్రo యొక్క కంటెంట్ ను DVD/USB(Pen Drive)/Blu-ray ఫార్మాట్లలో సంబంధిత ఫారాలతో జతపరచి పంపుటకు చివరి తేది: 14 డిసెంబర్, 2020. 

Trending