Spread the love

‘గురుబ్రహ్మ: గురువిష్ణు: గురుదేవో: మహేశ్వర: గురుసాక్షాత్‌ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:’’ అన్నారు మన పండితులు. కానీ గురువుల పరిస్థితి మరీ దయనీయంగా తయారయ్యింది నేడు. ప్రయివేటు పాఠశాలల్లో పంతుళ్ళుగా పని చేస్తూ చాలీ చాలని జీతాలతో జీవితాలను గడిపే ఉపాధ్యాయుల బ్రతుకు భారంగా తయారయ్యింది . కోవిడ్ 19 కారణంగా మూతపడిన పాఠశాలలు నేటికి తెరుకోకపోవడంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి ఐఏయస్ , ఐపియస్, డాక్టర్లను, కవులను, కళాకారులను, దేశం గర్వించదగిన నాయకులను, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను, మరెందరినో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన వారి జీవితాల్లో నేడు చీకట్లు కమ్ముకున్నాయి . కనీసం కుటుంబం గడవని దారుణ పరిస్థితిలో రోడ్డున పడ్డారు. కనీసం వారి కుటుంబాల పరిస్థితిని, వారి బాగోగులను అడిగే నాధుడే కరువయ్యారు. ఎక్కడో ఒక చోట అనే కాకుండా దేశం మొత్తం ఇదే పరిస్తితి దాపురించింది . అత్యంత దయనీయంగా తయారయ్యింది ప్రయివేటు ఉపాధ్యాయుల బ్రతుకుచిత్రం. యాజమాన్యాలు చేతులెత్తేసి , వేతనాలు చెల్లించక మొహం చాటేసిన సమయంలో కనీసం ప్రభుత్వాలు పట్టించుకోలేని దీన స్థితి ప్రయివేటు ఉపాధ్యాయులది. కనీసం మరేవృత్తిలో ఉన్న ఈరోజు గౌరవంగా కుటుంబాన్ని పోషించుకునే వీలు కలిగేది అని ఎంతో మంది ఉపాధ్యాయుల మనోగతం. కనీస మానవత్వం లేకుండా యాజమాన్యాల తీరు , ప్రయివేటు టీచర్ల పరిస్థితి పై నోరైనఎత్తని ప్రభుత్వాలతో జీవన పోరాటంలో చావలేక బ్రతకలేక ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన వారి జీవితాల్లో నేడు చీకట్లు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతు ఆత్మహత్యల మాదిరిగా దేశంలో ప్రయివేటు ఉపాద్యాయుల ఆత్మహత్యలు జరిగే అవకాశం లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ప్రయివేటు పంతుల్ల జీవితాల గురించి ఆలోచించి, ప్రభుత్వం తరపున కొంతైనా సాయం అందకపోదా అని ఎదురు చూస్తూ.. ఓ ప్రయివేటు పండితులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!