Connect with us

ఆంధ్రప్రదేశ్

పెన్షన్ పడిగాపులు

Published

on

Spread the love

అమరావతి : బయోమెట్రిక్ ముద్రలు తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో సమస్యలు అవాంతరాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ 1న ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరంతరాయంగా పంపిణీ కొనసాగినా బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయక ఇబ్బందులు ఎర్పడ్డాయి. చాలా చోట్ల సీనియర్ సిటిజన్స్ పెన్షన్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి కనిపించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.68 లక్షల మంది వాలంటర్లు..ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో వాలంటీర్లు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 9 గంటల వరకు దాదాపు 20

లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. అంటే మొత్తం అర్హుల్లో 30 శాతం మందికి పెన్షన్లు పంపిణీ జరింది. ఆ తర్వాత ఇంటర్నెట్ సమస్యలు, వేలిముద్రలు ట్యాలీ కాకపోవడం వంటి కారణాలతో పెన్షన్ల పంపిణీ నెమ్మదించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం రూ.1496.07 కోట్లు విడుదల చేసింది. ఈ నెలలో  కొత్తగా 90,167 మందికి పెన్షన్‌ను అందిస్తున్నారు.