ఢిల్లీ మెట్రోలో నో టోకెన్

Spread the love

న్యూఢిల్లీ : కోవిడ్ 19 విజృంభణతో దాదాపు ఐదు  నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పట్టాలెక్కబోతున్నాయి. కేంద్రం హోంశాఖ ఇటీవల  విడుదల చేసిన అన్ లాక్ 4.0 లో సెప్టెంబర్ ఏదో తేదీ నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సురక్షిత మెట్రో ప్రయాణాన్ని అందించేందుకు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్  సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వైరస్ వ్యాప్తికి ప్రధాన వాహకంగా పని చేసే అవకాశం ఉన్నందున ‘నో టోకెన్’ విధానాన్ని అమలు చేయనుంది. దాని స్థానే స్మార్ట్ కార్డులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. దీంతో పాటు మాస్క్ లు, థర్మల్ స్ర్కీనింగ్, సామాజిక దూరం తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్టేషన్ ఎంట్రీ నుంచి బోగి లో కూర్చునే వరకు పలు మార్గదర్శకాలను రూపొందించింది.  ప్రయాణీకుల రద్దీని తగ్గించే దిశలో మెట్రో స్టాప్ లను తగ్గించనున్నారు. ఒకే దారిలో వెళ్లే రైళ్లకు వివిధ స్టాప్ లను కేటాయించనున్నట్టు తెలిసింది. అలాగే దశల వారిగా స్టేషన్లను సంఖ్యను పెంచనున్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో మెట్రో స్టేషన్లు మూసివేసే ఉంటాయి. ముఖ్యంగా బోగీలోకి తాజా గాలి వచ్చేలా ఏయిర్ కండీషన్ సిస్టం ను పునరుద్దరించనుంది. ఉష్టోగ్రత 26 డిగ్రీలకు పరిమితం అయ్యేలా వ్యవస్థను మార్చనున్నారు. ప్రయాణీకులు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునేలా హ్యాండ్ సానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. కాగా,  ఢిల్లీ మెట్రో సర్వీసుల్లో  పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ కైలాష్ గల్హోత్ తెలిపారు. మెట్రో ప్రయాణాల కోసం వినియోగించే టోకెన్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ… సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డిజిటల్ పేమెంట్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎంట్రీ వద్దే ప్రయాణీకులకు థర్మల్ స్ర్కీనింగ్ చేసి, లోపలికి అనుమతిస్తామని తెలిపారు. లిఫ్ట్ లు, బోగీల్లో తక్కువ మందిని మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు తగ్గట్లుగా ప్లాట్ ఫాంపై మెట్రో రైల్ నిలిచే సమయాన్ని పెంచుతామన్నారు.  మెట్రో సర్వీసులను పున: ప్రారంభించాలని సీఎం కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ట్రయల్ బేసిస్ లో దశల వారిగా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. కాగా,  కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  హర్షం వ్యక్తం చేశారు. ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!